ముత్తారంలో గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు
ముత్తారంలో గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్
ముత్తారం, జూన్ 13(విజయ క్రాంతి): ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెండం గణేష్ భార్య, కీర్తిశేషులు స్వప్న ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా శనివారం మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా స్వప్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న, మాజీ జడ్పీటీసీ ఎల్లె రామ్మూర్తి, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం, ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె పోషం, మాజీ సర్పంచులు తీగల సమ్మయ్య, ఎరుకల ఓదెలు మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






