26-12-2025 05:07:40 PM
హైదరాబాద్: ఘట్‌కేసర్ పరిధిలోని అన్నోజిగూడలో అగ్నిప్రమాదం ప్రమాదం సంభవించింది. ఘట్‌కేసర్ నుండి ఉప్పల్‌కు వెళ్తున్న ఓ ఓమ్ని వ్యాన్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన వ్యాన్ డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపేశాడు. డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవాడంతో వ్యాన్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. పెట్రోల్ బంకు సిబ్బంది వెంటనే స్పందించి, బంకులోని అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలను ఆర్పిడంతో పెను అగ్నిప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో ఓమ్ని వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది.