calender_icon.png 26 December, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించుకుందాం

26-12-2025 04:24:20 PM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్పంచ్(Congress Sarpanchs)లకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించే వరకు యాత్ర కొసాగాలని తెలిపారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ల సమస్యలపై చొరవ చూపే బాధ్యత తమదని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయంతో కేసీఆర్ కు గుబులు మొదలైందని మంత్రి వివేక్ వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసిందన్నారు. బీఆర్ఎస్ కు పట్టు ఉన్న జూబ్లీహిల్స్ లోనూ విజయం సాధించామని తెలిపారు. రెండేళ్ల పాటు ఫాంహౌస్ లో ఉండి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్దారు.