calender_icon.png 16 July, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు

25-06-2025 11:53:30 PM

కుండపోత వర్షం.. ఇద్దరు మృతి

కుల్లు: క్లౌడ్ బరస్ట్(Cloud Burst) కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. బుధవారం హిమాచల్‌లోని కులు జిల్లా(Kullu District)లో కురిసిన కుండపోత వర్షానికి ఆకస్మిక వరదలు సంభవించాయి. నదులు, వాగుల్లో నీటి ప్రవాహం తీవ్రంగా పెరిగింది. ఆకస్మిక వరదల కారణంగా ఇద్దరు మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన రెస్క్యు టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి. వరదల కారణంగా జాతీయ రహదారి బ్లాక్ అయింది. ఇద్దరు మంత్రులు కూడా చిక్కుకున్నట్టు తెలుస్తోంది.