11 August, 2026 | 1:42 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

పీజీఊ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్

26-06-2025 12:00 AM

చలపతి ఫార్మసీ విద్యార్థిని ఉమామహేశ్వరి ఘనత

గుంటూరు, జూన్ 25 (విజయ్‌క్రాంతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసిన పీజీబొ ఫలితాల్లో చలపతి ఫార్మసీ విద్యార్థిని ఏ ఉమామహేశ్వరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిందని కళాశాల ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు తెలిపారు. బుధవారం స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌తో పాటు 100 ర్యాంకులు లోపు వచ్చిన విద్యార్థులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ మొ త్తం.. 32 మంది పరీక్షకు హాజరుకాగా నూరు శాతం విద్యార్థులు విజయ ఢంకా మోగించారన్నారు.

తనూజ భాగ్యశ్రీ స్టేట్ ఏడవ ర్యాం కు, సిహెచ్ వీరమోహన్‌రెడ్డి 25వ ర్యాంకు, డి వేలంగిని రాణికి 42వ ర్యాంకు, కి లక్ష్మీసాయి 64వ ర్యాంకు, బి తనుజ 99వ ర్యాం కులు సాధించి కళాశాల కీర్తి పతాకాన్ని ఎగరవేశారని తెలిపారు. వెయ్యిలోపు 22 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారన్నారు.

విద్యార్థులను జి-ఫ్యాట్, నైపర్, పీజీ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయటానికి ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెం టర్‌ను కళాశాలలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకుల చే విద్యార్థులకు ఉచితంగా ప్రత్యేక శిక్షణ తరగతులు ఇస్తూన్నారని తెలిపారు. విద్యార్థుల ను చలపతి విద్యా సంస్థల అధినేత వైవి ఆంజనేయులు సన్మానించారు.