calender_icon.png 1 December, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీలంకలో బీభత్సం

01-12-2025 08:42:03 AM

  1. శ్రీలంకను ఆగం చేసిన దిత్యా తుఫాన్
  2. 334 ప్రాణాలు బలిగొన్న దిత్వాతుఫాన్
  3. తుఫాన్ తో 370 మందికిపైగా గల్లంతు
  4. 11 లక్షల మందిపై దిత్వా ప్రభావం
  5. శ్రీలంకు భారత్ ఆపన్న హస్తం
  6. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

కొలంబో: శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం(Cyclone Ditwah wreaks havoc) సృష్టించింది. దిత్యా తుఫాన్(Cyclone Ditwah) కారణంగా శ్రీలంకలో 334 మంది మృతిచెందారు. మరో 370 మందికి పైగా గల్లంతు అయినట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. మధ్య, తూర్పు ప్రాంతాల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. శ్రీలంకలో దాదాపు 11 లక్షల మందిపై దిత్వా తుఫాన్ ప్రత్యక్ష ప్రభావం చూపింది. 

ఆపరేషన్ సాగర్ బంధుతో ఆపన్న హస్తం

ఆపరేషన్ సాగర్ బంధు(Operation Sagar Bandhu) పేరుతో శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. శ్రీలంకలో క్షతగాత్రుల చికిత్స కోసం భారత్ వైద్యబృందాలను పంపింది. భారత్ వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. భారత్ విమానాలతో 21 టన్నుల సహాయ సామాగ్రి పంపిణీ చేసింది. ఐఎన్ఎస్ సుకన్య నౌకతో(INS Sukanya) మరికొంత సహాయ సామాగ్రి తరలించారు. దిత్యా ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో తమిళనాడులో అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తీరప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్స్య కారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.