01-12-2025 08:25:56 AM
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Parliament Winter Session) సోమవారం ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Parliament Session) జరగనున్నాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఢిల్లీ పేలుడు ఘటన(Delhi blast incident), దేశభద్రత, రైతుల సమస్యలు, ఢిల్లీ వాయుకాలుష్యంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) కోరింది. పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలా తయారీపై కొత్త సెస్ విధించడానికి ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది.
సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు(Central Excise Amendment Bill), 2025, ప్రస్తుతం సిగరెట్, నమిలే పొగాకు, సిగార్లు, హుక్కాలు, జర్దా, సువాసనగల పొగాకు వంటి అన్ని పొగాకు ఉత్పత్తులపై విధించబడుతున్న జీఎస్టీ పరిహార సెస్సును భర్తీ చేస్తుంది. సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) ఓటర్ల జాబితాపై చర్చపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సభ సమర్థవంతంగా పనిచేస్తుందా అనే దానిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.