01-12-2025 08:14:05 AM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాలు
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) సందర్భంగా ఆహ్వనాలు పంపనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించనుంది. సదస్సుకు పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక వేత్తలు, క్రీడాకారులు, ప్రముఖులను పిలవనుంది.
ఇందుకోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యకర్శి ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈ నెల 8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వనించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతులు రాహుల్ గాంధీ, మల్లిఖర్జున్ ఖర్గేలను స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో వెబ్ సైట్ ఏర్పాటు చేసి వసతుల కల్పనకు చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆహ్వాన కమిటీని సమన్వయం చేయనున్నారు. ఆహ్వానాల వివరాలను డ్యాష్ బోర్డు ద్వారా సీఎం రేవంత్ పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే 4500 మందికి ఆహ్వానాలు పంపామని జయేశ్ రంజన్ వెల్లడించారు.