calender_icon.png 17 July, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెక్కలు వచ్చాక ఎగరడానికి అనుమతి కావాలా?

26-06-2025 12:00:00 AM

  1. ఎక్స్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర పోస్ట్
  2. కాంగ్రెస్ నేతలనుద్దేశించేనంటూ చర్చ
  3. కొందరికి మోదీనే తొలి ప్రాధాన్యమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చురకలు

న్యూఢిల్లీ, జూన్ 25: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీరు ఆ పార్టీ నేతలకు కంటగింపుగా తయారైంది. పాకిస్థాన్ దుస్సహ సాలు, ఆపరేషన్ సిందూర్‌కు దారితీసిన అంశాలను ప్రపంచ దేశాలకు వివరించేందు కు కేంద్రం ఎంపీల బృందాలను వివిధ దేశాలకు పంపించింది. శశిథరూర్ నేతృత్వంలోని బృందం రష్యాకు వెళ్లింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోదీని పొగుడుతూ శశిథరూర్ పలు వ్యాఖ్యలు చేశా రు.

దౌత్య విధానాల్లో నరేంద్రమోదీ అనుసరించిన విధానంపై ప్రశంసలు కురిపించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా శశిథరూర్‌పై విరుచుకుపడుతున్నా రు. ఈ నేపథ్యంలో శశిథరూర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘రెక్కలు వచ్చాక ఎగరడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఆకాశం ఏ ఒక్కరి సొత్తు కాదు. నీ రెక్కలు నీ ఇష్టం’ అంటూ ఓ పక్షి ఫొటోను షేర్ చేశారు.

ఇది కాంగ్రెస్ సీనియర్ నేతలను ఉద్దేశించి చేసినవంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఏది మాట్లాడాలన్న కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతి తీసుకోవాల్సిన పని లేదన్నది ఆ పోస్ట్ సారాంశమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. శశిథరూర్ పోస్ట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరోక్షంగా చురకలు అంటించారు.

ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమకు దేశమే తొలిప్రాధాన్యమని తర్వాతే పార్టీ అని పేర్కొన్నారు. కానీ కొందరు నేతలకు మా త్రం పార్టీ కంటే ప్రధాని నరేంద్రమోదీనే ప్రాధాన్యమని పరోక్షంగా శశిథరూర్‌పై మం డిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి సమయంలో కాంగ్రెస్ బాధితుల పక్షాన నిలబడిందని స్పష్టం చేశారు.