14 July, 2026 | 4:50 AM

చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఫ్లెమింగ్ గుడ్‌బై

14-07-2026 12:00 AM

చెన్నై, జూలై 13: ఐపీఎల్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఓ ప్రయాణానికి తెరపడింది. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ బా ధ్యతల నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకున్నాడు. గత 18 సంవత్సరాలుగా ఫ్రాంచైజీతో కొనసాగుతున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నాడు. ఫ్రాంఛైజీ యాజమాన్యంతో పరస్పర అంగీకారానికి వచ్చిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ కోచ్, టీమ్ మధ్య ఇంత బలమైన బంధం కొనసాగడం ఇదే మొదటిసారి. స్టీఫెన్ ఫ్లెమింగ్, మేనేజ్మెంట్ మధ్య జరిగిన పలు విడతల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది.