14 July, 2026 | 4:49 AM

హెచ్‌సీఏ ఈ ప్రశ్నలకు జవాబివ్వాలి: టీసీఏ

14-07-2026 12:00 AM

టీజీ20 లీగ్ నిర్వహణ నిబంధనలకు విరుద్ధం

బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోలేదు

జిల్లా క్రికెటర్లకు నామమాత్రపు ప్రాధాన్యత

హైదరాబాద్, జూలై 13: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహించిన టీజీ20 లీగ్ పూర్తిగా బీసీసీఐ రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ లీగ్ చట్టబద్ధత, పరిపాలనా విధానం, నిబంధనల అమలుపై ప్రజ లకు జవాబు చెప్పాల్సిన బాధ్యత హెచ్‌సీఏకు ఉందని పేర్కొంది.

ఈ సందర్భంగా టీజీ20 లీగ్ నిర్వహణపై టీసీఏ పలు కీలక అంశాలను గుర్తు చేసింది. తెలంగాణ క్రికెట్‌కు సంబంధించిన కీలక అంశాలు బాంబే హైకోర్టులో విచారణలో ఉండగానే హెచ్‌సీఏ టీజీ20 లీగ్ నిర్వహించడం అత్యంత ఆందోళనకర విషయమని పే ర్కొంది. 2021 జూలై 11న బీసీసీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హైదరా బాద్ నగర పరిధి వెలుపల క్రికెట్ కార్యకలాపా ల విషయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) తో సంప్రదింపులు జరిపి, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సి ఉండగా అలాంటి సంప్రదింపులు గానీ, సహకారం గానీ జరగలేదనీ తెలిపింది.

టీజీ20 లీగ్‌ను హెచ్‌సీఏ రాజ్యాంగంలోని రూల్ 28, రూల్ 30లో పేర్కొన్న అనుమతులు, విధివిధానాలను పాటించకుండా నిర్వహించినట్లు కనిపిస్తోందని టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాంచైజీలకు తెలంగాణ జిల్లాల పేర్లు పెట్టినప్పటికీ, ఆయా జిల్లాలకు చెందిన టీసీఏలో నమోదు చేసుకున్న అనేక మంది క్రికెటర్లను ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.