07-11-2025 09:56:30 AM
న్యూఢిల్లీ: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో(Delhi airport air traffic control) సాంకేతిక సమస్యల కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో(Delhi Airport) 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని, ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అయిన దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) రోజుకు 1,500కి పైగా విమానాల రాకపోకలను కొనసాగిస్తోంది. గురువారం సాయంత్రం నుండి సాంకేతిక సమస్యల కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమాన ప్రణాళికలను స్వయంచాలకంగా పొందలేకపోతున్నారని అధికారులు పేర్కొన్నారు.
విమాన ప్రణాళికలను అందించే ఆటో ట్రాక్ సిస్టమ్ (Auto track system) కోసం సమాచారాన్ని అందించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)లో కొన్ని సమస్యలు ఉన్నాయని, సిస్టమ్ సమస్యలు కొనసాగుతున్నందున, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అందుబాటులో ఉన్న డేటాతో విమాన ప్రణాళికలను మాన్యువల్‌గా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇది సమయం తీసుకునే ప్రక్రియ అందుకే అనేక విమానాలు ఆలస్యం అవుతున్నాయని వెల్లడించారు. ఈ సమస్యలు విమానాశ్రయంలో విమాన ట్రాఫిక్ రద్దీకి(Air traffic congestion) కూడా కారణమవుతున్నాయని, అధికారులు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని ఐజీఐఏ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం విమానాశ్రయంలో 100 కి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయన్నారు. విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24.com లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల నిష్క్రమణలకు దాదాపు 50 నిమిషాలు ఆలస్యం అయింది.