07-11-2025 11:16:18 AM
ఢిల్లీలో 'వందేమాతరం' 150వ స్మారకోత్సవం
న్యూఢిల్లీ: నేటితో వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఢిల్లీలో వందేమాతరం 150వ స్మారకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) పాల్గొన్నారు. స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ... వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం.. ఒక మంత్రం అన్నారు. వందేమాతరం గీతం దేశమాత ఆరాధన, సాధన అన్నారు. వందేమాతరం.. మనల్ని పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందని ప్రధాని పేర్కొన్నారు. వందేమాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. వందేమాతరం.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని చెప్పారు. వందేమాతరం సామూహిక గీతాలాపన అద్భుత అనుభవం అన్నారు. ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని పేర్కొన్నారు. వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పిన ప్రధాని వందేమాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని సూచించారు. వందేమాతరం స్మారక స్టాంపు, నాణెం విడుదల చేసినట్లు ప్రధాని తెలిపారు.
ప్రతి గీతానికి ఒక మూల భావం,. సందేశం ఉంటుందని ఆయన వెల్లడించారు. వందేమాతరం మూల భావం భారత్.. మా భారతి అన్నారు. భారత్ సంకల్పం.. ప్రతి వ్యక్తి నిలదొక్కుకునే ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. పూర్వీకులు భారత్ ను సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారని చెప్పిన నరేంద్ర మోదీ భారత్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అమరత్వం పొందిందని వెల్లడించారు. వందేమాతరం.. దేశ స్వాతంత్య్రానికి ప్రేరణగా నిలిచిందన్నారు. బంకించంద్ర ఆనందమఠ్ ఉపన్యాసం మాత్రమే కాదని ఠాగూర్ చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఆనందమఠ్ ఉపన్యాసం.. భారత స్వప్నం అని ఠాగూర్ చెప్పారు.. ఆనందమఠ్ లో వందేమాతరం ప్రసంగం.. బంకించంద్ర భావాలు నిక్షిప్తమై ఉన్నాయని తెలిపారు. ఆంగ్లేయుల పాలనలోనూ వందేమాతరం గీతం బందీగా లేదన్న ఆయన బానిసత్వపు రోజుల్లోనూ వందేమాతరం గీతం అమరత్వం పొందిందని స్పష్టం చేశారు.