calender_icon.png 7 November, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైసమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు..

07-11-2025 10:53:21 AM

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలి 

ఉత్సాహాలలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ కమిషనర్ హరీష్ దంపతులు, ఏమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి  దంపతులు 

కడ్తాల్, (విజయక్రాంతి): కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ(Maisigandi Maisamma Temple) బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఉత్సవాలను  పురస్కరించుకొని గురువారం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు,రాష్ట్ర దేవాదాయ కమిషనర్ హరీష్ దంపతులు ఆలయం కు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన మహా చండీయాగం లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన వారికి ఫౌండర్ ట్రస్ట్ శిరోలి, ఈవో స్నేహలత, అర్చకులు ఘన స్వాగతం పలికి పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.