07-11-2025 09:15:32 AM
హైదరాబాద్: అయ్యప్ప భక్తులకు(Ayyappa devotees) దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ద.మ. రైల్వే జనవరి వరకు శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు(Special Trains for Sabarimala) ఏర్పాటు చేసింది. మచిలీపట్నం, నర్సాపూర్, చర్లపల్లి, నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు దక్షిణ మధ్య రైల్వే వెబ్ సైట్(South Central Railway website)లో ఉన్నాయి. నేటి నుంచి ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి కొల్లాం (రైలు నంబర్ 07107)- నవంబర్ 17, 24 తేదీల్లో, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తారీఖుల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి శబరిమలకు బయలుదేరుతాయి.
ఇవి తర్వాత రోజు కొల్లాం చేరుకుంటాయి. మొత్తం 10 రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవి పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంటలో ఆగనున్నాయి. కొల్లాం నుంచి చర్లపల్లి (రైలు నంబర్ 07108)- నవంబర్ 19, 26 తేదీల్లో, డిసెంబర్ 3, 10, 17, 24, 31 తారీఖుల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లా నుంచి శబరిమలకు బయలుదేరుతాయి. మరుసటి రోజు చర్లపల్లి చేరుకోనున్నాయి. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, గుంటూరు, పగిడిపల్లి మీదుగా వస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.
https://twitter.com/SCRailwayIndia/status/1986470711435972626