07-11-2025 11:35:03 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) వేళ కలకలం రేగింది. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నేతల(BRS leaders) ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Former Nagarkurnool MLA Marri Janardhan), ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు(Election flying squad searches) నిర్వహిస్తోంది. మోతీనగర్‌లోని మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇళ్లలో సోదాలు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం భారీ ఎత్తు డబ్బు నిల్వ చేశారనే ఫిర్యాదులతో సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి తమ ఇళ్ల మీద దాడులు చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ అధికార యంత్రాంగాన్ని ప్రయోగిస్తున్నారని మండిపడుతున్నారు. మోతీ నగర్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో, కూకట్‌పల్లి బీఎస్పీ కాలనీలోని ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో లేని ప్రాంతాల్లో అనుమతి లేకుండా పోలీసులు తమ ఇళ్లల్లోకి ఎలా వస్తారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు.
