07-11-2025 10:50:25 AM
సరైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
ఎస్ఎఫ్ఐ,పిడిఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పరిపాలన భవనం ముట్టడి
హనుమకొండ,(విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి(Hanumakonda District Secretary) మంద శ్రీకాంత్ అన్నారు. గురువారం ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పరిపాల భవనం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయని,
ప్రధానంగా యూనివర్సిటీలోని హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని, కామన్ మెస్ లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని,సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని,సబ్ క్యాంపస్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని,ఇంజనీరింగ్ కళాశాల రోడ్డు మార్గం మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని అదేవిధంగా,కామన్ మెస్ లో జరుగుతున్న దొంగ బిల్లుల పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ సమస్యలపై రిజిస్టర్ రామచంద్రం ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు చెన్నూరు సాయికుమార్, బి రెడ్డి జస్వంత్, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు బి. వంశీకృష్ణ,విద్యార్థి సంఘాల నాయకులు రాహుల్,సూరజ్,మల్లేష్, సందీప్, సాయి, పవన్ కుమార్, ప్రవళిక అనూష,రాధిక,మానస, నితిషా తదితరులు పాల్గొన్నారు.