28-07-2025 01:03:04 AM
నాలాలు, కల్వర్టుల క్లీన్ చేస్తున్న హైడ్రా
హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 27(విజయక్రాంతి): భారీ వర్షాలు కురుస్తుండడం తో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుం డా నివారించేందుకు హైడ్రా బృందాలు నా లాలు, కల్వర్టుల వద్ద పూడికతీత పనులను ముమ్మరం చేశాయి. ఆక్రమణలు, వ్యర్థాలతో పూడుకు పోయిన నాలాలను, కల్వర్టులను శుభ్రం చేయడంతో పాటు, ఆక్రమణలను తొలగించే పనులను హైడ్రా చురుకుగా చేపడుతోంది.
నగరంలోని పలు నాలాలు ఆక్రమణలకు గురికావడంతో కుచించుకుపోయి, వర్షపు నీరు సాఫీగా పారే మార్గం లేకుండా పోయింది. దీంతో చిన్నపాటి వర్షాలకే లోతట్టు బస్తీలు, కాలనీలు జలమయం అవుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు, వర్షకాల ఆరంభంలోనే హైడ్రా అధి కారులు రంగంలోకి దిగారు. నాలాల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను పొక్లెయినర్లతో తొలగించే పనులను ప్రారంభించారు.
150 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు
నగరంలోని అనేక కల్వర్టులు, నాలాలు టన్నుల కొద్దీ చెత్తతో పూడుకుపోయి మూ సుకుపోయినట్లు హైడ్రా అధికారులు గుర్తించా రు. కొన్ని చోట్ల నాలాల ఆనవాళ్లే కనిపిం చని పరిస్థితి నెలకొంది. మ్యాన్‌హోళ్ల మూతలు తీస్తే ఇసుక మేటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షపు నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో, హైడ్రా ఆధ్వర్యంలో పనిచేస్తు న్న 150 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు, 51 హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందా లు కలిసి నాలాలు, కల్వర్టుల వద్ద పూడిక తీత పనులు చేపడుతున్నాయి.
ఈ క్రమంలో యూసుఫ్‌గూడ పరిసరాల్లోని మధురానగర్, కృష్ణానగర్ వద్ద వరద కాలువలో పేరుకుపోయిన చెత్తను హైడ్రా బృందాలు తొలగించాయి. గచ్చిబౌలిలోని జనార్దన్ రెడ్డి నగర్‌లోని నాలాల్లో పేరుకుపోయిన చెత్తను కూడా హైడ్రా తొలగించిం ది. కాప్రా సర్కిల్ వార్డులోని మార్కండేయ కాలనీలో నాలా క్యాపిట్ ఏరియాలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు.
ఎల్‌బీన గర్ సర్కిల్ పరిధిలోని ఆర్‌సీఐ రోడ్డు, మిథిలానగర్ దగ్గర మంత్రాల చెరువు నుంచి జిల్లెల గూడ చెరువునకు వెళ్లే నాలాలో ఉన్న పూడికను హైడ్రా డీఆర్‌ఎఫ్, ఎంఈటీ బృందాలు జేసీబీ ద్వారా తొలగించాయి. ఖైరతాబాద్ చౌ రస్తా వద్ద నాలా కల్వర్టులో పెద్ద ఎత్తున పేరుకుపోయిన వ్యర్థాలను కూడా హైడ్రా తొలగిం చింది. కొన్ని చోట్ల వ్యర్థాలను తొలగించలేని పరిస్థితిలో, లాంగ్ ఆర్ జేసీబీలను ఉపయోగించి థర్మాకోల్, ప్లాస్టిక్ వ్యర్థాలతో సహా చెత్త ను తొలగించారు. ఈ పనుల ఫలితంగా ఆ యా ప్రాంతాల్లో వరద నీరు సాఫీగా ప్రవహిస్తోంది. జూలై 1వ తేదీ నుంచే నాలాల, కల్వర్టు ల క్లీనింగ్ పనులను హైడ్రా ప్రారంభించింది.
కట్టడాల తొలగింపు
నాలాల్లోని వ్యర్థాలను తొలగించడమే కా కుండా, నాలాలను ఆక్రమించి నిర్మించిన క ట్టడాల తొలగింపును కూడా హైడ్రా చేపట్టిం ది. ఖైరతాబాద్ శ్రీధర్ ఫంక్షన్ హాల్ వద్ద బు ల్కాపూర్ నాలా ఆక్రమణలను తొలగించారు. మూసాపేటలో నాలాలను కబ్జా చేసి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. నల్లగండ్లలో ఎస్‌ఎన్‌డీపీ ద్వారా నాలా కట్టడాని కి అడ్డుగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించింది.
ఇలా నాలాలు కబ్జా చేసిన ప్రతి చో టా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఈ వ ర్షాకాలంలో భారీ వర్షాలు పడేలోపు నాలాల్లోని వ్యర్థాలను తొలగించడంతో పాటు, నా లాలపై కట్టిన అక్రమ కట్టడాలను క్లియర్ చే స్తామని హైడ్రా అధికారులు తెలిపారు. దీనివల్ల భారీ వర్షాలకు వచ్చే వరద నీరు సాఫీ గా వెళ్లిపోయి లోతట్టు ప్రాంతాలపై వరద ప్రభావం తగ్గుతుందని వారు పేర్కొన్నారు.