calender_icon.png 28 July, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తి కోర్టు నిర్మాణంకు 29 కోట్లు మంజూరు హర్షణీయం

28-07-2025 01:57:35 PM

తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనపర్తి జ్ఞాన సుందర్

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు తుంగతుర్తి సివిల్ కోర్టు నిర్మాణానికి 29 కోట్లు నిధులు మంజూరు చేయడం హర్షనీయమని తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో నూతన కోర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో కోర్టు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ, కచ్చిదారులకు ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో కోర్టు నిర్మాణం లేకపోవడంతో ఒక ప్రక్క కచ్చిదారులు మరొక ప్రక్క కోటి సిబ్బంది నిత్యం కష్టాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో నూతన కోర్టుకు ప్రభుత్వం 29 కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని హర్షించదగ్గ విషయమని అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో సబ్ కోర్టు కూడా ఏర్పాటుకు, హైకోర్టు అధికారులతో మాట్లాడి న్యాయవాదులు అంత కృషి చేస్తామని హామీ ఇచ్చారు.