calender_icon.png 28 July, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్.. ఇంటి బాట పట్టిన గురుకుల విద్యార్థులు..!

28-07-2025 02:02:21 PM

- అస్వస్థతకు గురైన మరో ముగ్గురు విద్యార్థులు

- కొనసాగుతున్న హెల్త్ క్యాంప్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): గురుకుల పాఠశాల వంట సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఫుడ్ పాయిజన్ జరగడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. సుమారు 111 మంది విద్యార్థులు కడుపునొప్పి వాంతులు విరేచనాలు వంటి వాటితో అస్వస్థతకు గురికావడంతో చికిత్స అనంతరం వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున మరో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది పరీక్షలు జరిపి మెరుగైన వైద్యం కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు.

వైద్యం పొందిన అనంతరం వారు కూడా తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు.  వారితోపాటు మరి కొంతమంది విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతూ ఇంటిబాట పడుతున్నారు. గురుకుల పాఠశాలలో 480, కళాశాలలో 360 మంది విద్యార్థులు చదువుతుండగా పకోడీతోపాటు రాత్రి పెరుగుతో భోజనం చేసిన 111 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇందులో 79 మంది ఇన్ పేషెంట్లుగా వైద్యం పొందరు.   ఉన్నతాధికారుల సూచన మేరకే విద్యార్థులను వారి వారి చెప్పినట్లు ప్రిన్సిపల్ లలిత తెలిపారు. 743 మంది విద్యార్థులకు గాను 436 మంది విద్యార్థులు ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.