28-07-2025 02:14:00 PM
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్‌డమ్'. ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, 24 గంటల్లోనే 30 వేల టికెట్లు సేల్ అయ్యాయి. దీంతో ఈ సినిమా.. టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండ్ అవుతోంది. మరోవైపు ఓవర్సీస్‌లోనూ ప్రీ సేల్స్‌లో జోరు చూపిస్తోందీ చిత్రం. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ క్రేజ్ చూసిన మేకర్స్ ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రీమియర్స్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నెల 30న కింగ్‌డమ్’ ప్రీమియర్ షోస్ వేయనున్నట్టు ఇప్పటికే టీమ్ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంగా సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇప్పటికే భారీగా అంచనాలేర్పడ్డాయి.
ఈ సినిమాతో విజయ్‌కు బ్లాక్‌బస్టర్ పక్కా అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్‌పై అటు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా, సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. జోమోన్ టీ జాన్, గిరీశ్ గంగాధరన్ డీపీగా పనిచేస్తున్నారు.