28-07-2025 01:24:04 AM
మానిటరింగ్ చేస్తున్న జల మండలి అధికారులు
వరద ఇలాగే కొనసాగితే నేడో, రేపో గేట్లెత్తే అవకాశం
రంగారెడ్డి/చేవెళ్ల, జులై 27(విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి జీవనాడి లాంటి ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ, ఈసీ వాగులు పొంగి పొర్లుతుండడంతో ఈ రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాయి. ఉస్మాన్సాగర్ పూర్తి సామర్థ్యం 3.90 టీఎంసీలు, ఫుల్ ట్యాంక్ లెవల్ 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,783 అడుగులకు, హిమాయత్సాగర్ సామర్థ్యం 2.97 టీఎంసీలు, ఫుల్ ట్యాం క్ లెవల్ 1,764 అడుగులు కాగా, ప్రస్తుతం 1,762 అడుగులకు చేరింది.
దీంతో జలమండలి అధికారులు అప్రమత్తం అయ్యా రు. రెండు రోజుల కింద జలాశయాలను సందర్శించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేసి గేట్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా యంత్రాంగంతో పాటు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీసులతో సమన్వయం చేసుకొనిని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ మేరకు చర్యలు చేపట్టిన జలమండలి అధికారులు లోతట్టు ప్రాం తాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసి సంబంధిత సిబ్బందికి బాధ్యతలు అప్పజెప్పారు. జులై 30 వరకు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించడంతో సోమ, మంగళ వారాల్లో గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది.
-ఆక్రమణలతో తప్పని వరద ముప్పు
జంట జలాశయాలల్లోకి వచ్చే మూసీ, ఈసీతో పాటు ఇతర వాగులు కూడా కొన్ని చోట్ల కబ్జాలకు గురికావడంతో పలు ప్రాం తాలకు వరద ముప్పు తప్పడం లేదు. వాగులను ఆక్రమించుకోవడమే కాదు కాంపౌండ్ వాల్స్ కడుతుండడంతో వరద దిశను మార్చు కొని ముంపునకు కారణమవుతున్నాయి. మొయినా బాద్ మండల పరిధిలోని ఎర్రగుంట చెరువు నుంచి వచ్చే వరద కాలువకు ఇరువైపులా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రహరీలు నిర్మించడంతో పది రోజుల కింద కురిసిన వర్షానికి అది నాగిరెడ్డి గూడ నుంచి బాకారం వెళ్లే దారికి మళ్లింది.
ఈ రోడ్డుపై పెద్దఎత్తున వరద నీరు చేరడంతో బాకారం నుంచి ఎన్కేపల్లి, కాశీంబౌలి, అమ్డాపూర్ సహా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అమ్డాపూర్ నుంచి సుల్తాన్ పల్లి వెళ్లే దారిలో ఈసీ వాగుకు ఒక వైపు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో వరద వచ్చినప్పుడల్లా మరోవైపు ముంపునకు గురవుతోంది. శంకర్ పల్లి మండలం ప్రొద్దటూరు, పతేపూర్ తదితర ప్రాంతాల్లో మూసీ పరిస్థితి ఇలాగే ఉంది. ఓ వైపు కంపౌండ్ వాల్స్ ఉండడంతో వరద మరో వైపు పొలాలను ముంచెత్తుతోంది.
పంటలకు ఊరట
వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పంటలకు ఊరట కలిగింది. ము ఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో వేసిన పత్తి, జొన్న, మొక్కజొన్న తదితర పంటలకు ప్రా ణం పోసినట్లైంది. ఈసీ, మూసీలతో పాటు చిన్న, పెద్ద వాగు లు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో చెరువులు, కుంటలు నిండడమే కాకుండా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.
ఫలితంగా ఆయ కట్టుతో పాటు బోర్ల కింద కూడా వరి సాగు జోరందుకుంది. ప్రస్తుతం చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, పరిగి, వికారాబాద్, తాం డూర్ ప్రాం తాల్లో కరిగెటు, వరి నార్లు వేసే పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇం కో రెండు మూడు భారీ వానలు పడితే ఈ యేడు ఢోకా ఉండదని రైతులు చెబుతున్నారు.