15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

26-02-2026 12:40 AM
  1. వనపర్తి జిల్లా గిరిజన తండాకు చెందిన వసంత
  2. మానసిక వేదనే కారణమని భావిస్తున్న పోలీసులు

నిర్మల్, ఫిబ్రవరి 25 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఏ వసంత (19) అనే విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినులంతా తరగతులకు వెళ్లిన సమయంలో హాస్టల్‌లోని ఒక గది లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వనపర్తి జిల్లా గిరిజన తండా చెందిన వసంత బాసర త్రిబుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతుంది.

హాస్టల్ గదిలో నుంచి ఆమె ఎంతసేపటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు తెరవడంతో విద్యార్థి ఆత్మహత్య ఘటన తెలిసింది. వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ త్మహత్యకు ప్రేమే కారణమని అంటున్నారు. వసంత ప్రేమించిన గణేష్ హైదరాబాదులో చదువుకుంటూ హాస్టల్ గదిలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న వసంత మానసిక వేదనతో హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అయితే పోలీసులు ఆత్మహత్యకు వ్యక్తిగత కారణమై ఉంటుందని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి వసంత ఒకరితో ఫోన్‌లో మాట్లాడిందని ఆ ఫోన్ ఎవరిది అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న వసంత మృతదేహాన్ని పోలీ సు బందోబస్తు మధ్య బైంసా ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.