calender_icon.png 19 October, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోసపోతున్న రైతులు.. దోచుకుంటున్న ప్రైవేట్ సోయా కొనుగోలుదారులు

19-10-2025 05:54:44 PM

కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండలంలో స్థానిక రైతులు తమ చెమట చుక్కలతో పండించిన సోయా పంటను సరైన ధరకు అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ మార్కెట్‌కు సంబంధం లేకుండా కొందరు ప్రైవేట్ సోయా కొనుగోలుదారులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. రైతులకు నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ రేట్లకు పంటను కొనుగోలు చేస్తూ, తూకం లోపాలు, డెడక్షన్లు పేరుతో మోసం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ అధికారులు ఈ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.