29-09-2025 01:39:54 PM
రూ.16 వేలు, 2 పందెం కోళ్ల స్వాధీనం
భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని రాజారాం గ్రామ శివారులో కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.. భీమిని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుట్టు చప్పుడు కాకుండా గ్రామ శివారులలో కోళ్ల పందాలు ఆడుతున్నారనె సమాచారం మేరకు సిబ్బందితో కలిసి స్థావరంపై దాడి నిర్వహించినట్లు తెలిపారు. నాయిని సాయి, కొడిపే శంకర్, సీడం సురేష్ లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద దగ్గర నుంచి రూ. 16 వేల నగదు, రెండు కోళ్లను స్వాధీనం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది శ్రీనివాస్, ప్రవీణ్, వినోద్ కుమార్ లు తదితరులు ఉన్నారు.