08-01-2026 12:36:35 AM
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
బెజ్జూర్, జనవరి 7 (విజయక్రాంతి):గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో ఎంపీడీవో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులతో కలిసి ప్రణాళికతో గ్రామ కార్యదర్శులు గ్రామ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
గ్రామాలలో పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, ఇంటి పన్నుల వసూల్, పాఠశాలలో కిచెన్ షెడ్, ఉపాధి హామీ పనులు, నర్సరీలు తదితర విషయాలపై సలహాలు, సూచనలు చేశారు. విధి నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాజన్న, హౌసింగ్ ఏఈ సాయి కుమార్, ఈసీ మురళి, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.