3 July, 2026 | 10:41 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

టికెట్‌లేని ప్రయాణికులపై ఫోకస్

24-09-2024 02:20 AM

స్పెషల్ డ్రైవ్ చేపట్టిన రైల్వేశాఖ 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: పండగల సీజన్ నేపథ్యంలో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఇందులో భాగం గా అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని 17 జోన్ల జనరల్ మేనేజర్లకు రైల్వేశాఖ లేఖలు రాసింది. టికెట్ లేకుండా ప్రయాణించే వారిలో పోలీసులూ ఎక్కువగా ఉన్నట్లు రైల్వే కమర్షియల్ అధికారు లు వెల్లడించారు. ఇటీవల ఘజియాబాద్ సెక్షన్‌లో తనిఖీలు చేపట్టగా.. వివిధ రైళ్లలోని ఏసీ కోచ్‌లలో వందలాది మంది పోలీసులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారందరికీ జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించా రు. కాగా 2023 ఆర్థిక సంవత్సరంలో 3.61 కోట్ల మంది టికెట్ లేకుం డా పట్టుబడగా, వారి నుంచి జరిమా నా రూపంలో భారతీయ రైల్వే రూ. 2,231 కోట్లు వసూలు చేసింది.