11-07-2025 12:40:49 AM
ఎల్బీనగర్, జులై 10 : రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలు సరిపడా మంచినీరు తాగకపోవడంతో కిడ్నీ వ్యాధి బాధితులుగా మారి, దవాఖానల్లో చేరుతున్నారని, విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రం శేఖర్ అన్నారు. గురువారం ఎల్బీనగర్ లోని బీఎస్సీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్వహణ బాగా లేకపోవడంతో విద్యా ర్థులు మంచినీరు తాగలంటే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాది హైదరాబాద్ ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో 109 మంది పిల్లలకు వైద్యులు సర్జరీ చేసి మూత్ర పిండాల్లో చేరిన రాళ్లను తొలగించారని తెలిపారు. నూటికి 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు మూత్ర పిండాల సమస్య బారిన పడుతున్నార న్నారని పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు వ్యాధిగ్రస్తులుగా మారకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
స్కూళ్లలో టాయిలెట్స్ పనితీరు బాగాలేవని, టాయిలెట్స్ నిర్వహణ మంచిగా లేకపోవడంతో బాలికలు మంచినీరు తాగడం లేదన్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో లక్షల మంది విద్యార్థులు మూత్రపిండాల వ్యా ధులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణ వచ్చింది పదవులు అనుభవించడానికా? లేదా పేదల బతుకులు మార్చడానికి కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుకునేది కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసి సామాజిక వర్గాల విద్యార్థులే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై దృష్టి పెట్టాలని ఇబ్రం శేఖర్‌సూచించారు.