11-07-2025 01:32:05 PM
బెల్లంపల్లిలో విషాదo
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో తండ్రి కొడుకుల్ని పాముకాటు వేసిన సంఘటన కలవరo రేపింది. ఈ సంఘటనలో తనయుడు జంగపల్లి వేదన్షు(14 నెలలు ) మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలో విషాదo నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బెల్లంపల్లి బస్తీకి చెందిన జంగపల్లి ప్రవీణ్, జంగంపల్లి వేదన్షూలను శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలో ఉండగా పాము కాటు వేసింది. పాముకాటుతో మెలకువ వచ్చిన తండ్రి జంగపల్లి ప్రవీణ్ లేచి చూశాడు. ఇద్దరినీ పాము కాటు వేసిందని గ్రహించి హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి(Bellampalli Government Hospital) వెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు తండ్రి కొడుకుల్ని మంచిర్యాలకి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కొడుకు జంగపల్లి వేదన్షూ (14నెలలు ) మృతి చెందాడు. సంఘటనలో తండ్రి జంగపల్లి ప్రవీణ్ సేఫ్ అయ్యాడు. వేధన్షు మృతితో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.