calender_icon.png 11 July, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన హిందూ ధర్మంలోనే గురువులను పూజించే సంస్కృతి..

11-07-2025 12:40:27 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : గురు పూర్ణిమ సందర్భంగా ఆదిలాబాద్ లోని అతి పురాతనమైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి ఆశీ ర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆసారం బాపూజీ ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఎక్కడ లేని విధంగా తల్లిదండ్రుల తర్వాత గురువులను పూజించే సంస్కృతి కేవలం హిందూమతంలో ఉందన్నారు.

భారతదేశంలో పుట్ట డం మనం చేసుకున్న అదృష్టం అన్నారు. హిందూ సంస్కృ తి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయ్, మోహన్ అగర్వాల్, జోగు రవి, స్వామి, ధోని జ్యోతి పాల్గొన్నారు.