11-07-2025 01:26:28 PM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్‌సీయూకు(Hyderabad Central University) వచ్చి విద్యార్థులకు మద్దతు ఇచ్చారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. రోహిత్ వేముల తన సూసైడ్ నోట్ లో కారణాలను భట్టి విక్రమార్క వెల్లడించారు. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) హెచ్‌సీయూకు వచ్చారని పునరుద్ఘాటించారు. రామచందర్ రావు(N. Ramchander Rao) హెచ్‌సీయూ అధికారులపై ఒత్తిడి తెచ్చారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. దళిత, ఆదివాసీలపై బీజేపీ(BJP) చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తోందని విక్రమార్క పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను మేధావులు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని వర్సిటీల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు.