26 March, 2026 | 2:52 AM

ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో అన్నదానం

26-03-2026 12:00 AM

అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, మార్చి 25:(విజయక్రాంతి): ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్‌జీవో) కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎంహుస్సేనీ (ముజీబ్) బుధవారం అన్నదానం చేశారు. అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి వారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ సేవలో భాగంగా, ఈ వారం కూడా డాక్టర్ ముజీబ్ స్వయంగా పాల్గొని రోగులకు భోజన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికిత్స కోసం వచ్చే పేద రోగులకు, వారి సహాయకులకు ఆక లి బాధలు కలగకూడదనే ఉద్దేశంతో ప్రతి వారం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సేవా యజ్ఞం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కార్యక్రమం లో తెలంగాణ నాల్గవ తరగతి  ప్రధాన కార్యదర్శి ఖాదర్ బిన్‌హసన్, టీఎన్‌జీవో హైదరా బాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఖలీద్‌అహ్మద్, బి శంకర్, ముఖీమ్ ఖురేషి, ఏవీ శ్రీధర్ పాల్గొన్నారు.వీరితో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి యూనిట్ ప్రెసిడెం ట్ బి శివకుమార్, జిల్లా ,యూనిట్ సభ్యులు, హైదరాబాద్ జిల్లా ఏపీఆర్వో మహ్మద్ వహీ ద్, మహ్మద్ ముస్తాఫా తదితరులు పాల్గొని రోగులకు సేవలు అందించారు.