26 March, 2026 | 2:49 AM

చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ కేఫ్ ప్రారంభం

26-03-2026 12:00 AM

ఇబ్రహీంపట్నం, మార్చి 25 (విజయక్రాం తి): ఇబ్రహీంపట్నం పట్టణ కేంద్రంలో నరగారి శ్రీకాంత్, కె. అభినవ్ రెడ్డి సంయుక్తంగా ఏర్పాటు చేసిన చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ కేఫ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కేప్‌ను టీపీసీసీ సభ్యులు, అదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెంది న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చెన్నపట్నం కాఫీ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా నలుగురు యువకులు కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం.నేటి యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా స్వయం ఉపాధి వైపు కూడా దృష్టి సారించడం అవసరం. కష్టపడి, పట్టుదలతో ముందుకు సాగితే వ్యాపారంలో తప్పకుండా విజయం సాధించవ చ్చునన్నారు. అలాగే, ఈ కేఫ్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, నిర్వాహకు లకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.