13 August, 2026 | 2:49 AM

అమావాస్య సందర్భంగా అన్నదానం

13-08-2026 12:00 AM

నాగోల్‌లో 500 మందికి వితరణ

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): నాగోల్ మోహన్ నగర్ మెయిన్ రోడ్డులో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 500 మందికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్,

రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉప్పల శ్రీనివాస్‌గుప్త మాట్లాడు తూ.. అమావాస్య వంటి పవిత్రమైన రోజు ల్లో అన్నదానం చేయడం ఎంతో గొప్ప సే వా కార్యక్రమన్నారు. ఐవీఎఫ్ ప్రధమ మ హిళ ఉప్పల స్వప్న, మహిళా విభాగం సౌత్ ఇండియా ఇంఛార్జి చందా భాగ్య,  చీఫ్ అడ్వైజరీ మణిమాల, కోశాధికారి నళిని, వైస్ ప్రెసిడెంట్ అర్చన పాల్గొన్నారు.