13 August, 2026 | 4:02 AM

ఆస్పత్రిలో బాలింత ఆత్మహత్య

13-08-2026 12:00 AM
  1. సిజేరియన్ నొప్పులు భరించలేకనే?
  2. నల్లగొండ జనరల్ ఆస్పత్రిలో ఘటన

నల్లగొండ క్రైం, ఆగస్టు 12: నల్లగొండ జిల్లా ప్ర భుత్వ జనరల్ ఆసుపత్రిలో మంగళవారం బాలిం త ఆత్మహత్య చేసుకున్నది. మునుగోడు మండ లం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) 8 రోజుల క్రితం ప్రసవం కోసం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరింది.

ఆమె నాలుగు రోజుల క్రితం నాలుగలో సంతానంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి మూడు సాధారణ ప్రసవాల్లో ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. బుధవారం తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చిన మమత, ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది సమీపంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చే సుకుంది. సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సిజేరియన్ ఆపరేషన్‌తో నొప్పులు భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.