25-05-2025 12:00:00 AM
-పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
- ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నాయకుల పిలుపు
-బ్లాక్, బూత్ స్థాయి కమిటీలను నియమిస్తాం
ఎల్బీనగర్, మే 24 : ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం సాగర్ రింగ్ రోడ్ చౌరస్తాలోని వన్ కన్వెన్షన్ లో నిర్వహించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ చార్జి మధుయాష్కి గౌడ్, జిల్లా పరిశీలకులు శివసేన రెడ్డి, ధారాసింగ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్, శివసేన రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. డివిజన్ల అధ్యక్షులతో పాటు నియోజకవర్గ బ్లాక్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులను కూడా నూతనంగా ఏర్పాటు చేనున్నట్లు పేర్కొన్నారు.
బూత్ స్థాయి అధ్యక్షులకు పార్టీ పరంగా ప్రాధాన్యత ఉంటుం దని వివరించారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని వివరించారు. నియోజకవర్గ ఏ బ్లాక్, బీ బ్లాక్ అధ్యక్షుల నియామకాలు కూడా ఉంటాయన్నారు. బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ స్థాయి అధ్యక్షుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
పార్టీకి సమ యం కేటాయించి పనిచేసేవారు ముం దుకొచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పార్టీ అన్ని విధాలుగా ఆలోచించి సమర్థులను ఎంపిక చేస్తుందని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా డివిజన్ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్, కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టీ పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాశ్ గౌడ్, ముద్దగొని లక్ష్మీ ప్రసన్న, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల చీఫ్ ఏజెంట్ , న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్, మహిళా కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి, డివిజన్ అధ్యక్షులు లింగాల కిశోర్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, కుట్ల నర్సింహ యాదవ్, మంజులా రెడ్డి, బుడ్డ సత్యనారాయణ, చెన్నగొని రవీందర్, వేణుగోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్ నేలపాటి రామారావు, గణేష్ నాయక్, పన్యాల జయపాల్ రెడ్డి, రమేష్ నాయక్, కాంగ్రెస్ అధ్యక్షులు శివకుమార్, షేక్ షాకీర్, మహిళా నాయకురాలు రజనీరావు , రాజేశ్వరి వసంత, అనసూయ, అమరావతి, కవిత తదితరులు పాల్గొన్నారు.