calender_icon.png 26 May, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడికి- ప్రతిదాడి ఉంటుంది!

26-05-2025 12:19:04 AM

-ఉగ్రవాదంపై నివాళులర్పించే విధానానికి స్వస్తి

-మోదీ మన్‌కీబాత్ వీక్షణలో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): ఉగ్రదాడులపై దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోతే గులాబీ పూలతో, క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించే విధానానికి ప్రధాని మోదీ ప్రభుత్వం స్వస్తి పలికిందని..దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని ఒక్కరిని చంపితే వందమందిని చంపుతామనే విధానాన్ని పాకిస్థాన్ కు కళ్లకుకట్టినట్లు చూపించామని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

ప్రధాని మోదీ మన్ కీబాత్ 122వ ఎపిసోడ్‌ను ఆదివారం సనత్ నగర్‌లో ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యక ర్తలతో కలిసి వీక్షించారు. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్రధాని మాట్లాడిన ముఖ్యమైన స్వచ్ఛత, యోగా, డయాబెటీస్‌లాంటి విషయాలను ఆచరణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్రజలను జాగృతం చేస్తోందని, ఐక్యంగా నిలబె డుతుందని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిస్తుందన్నారు. ఇందులోని ప్రధాని చేసిన సూచనలు, సలహాలు ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఆచరించాలని కోరారు.

ఆపరేషన్ సిందూర్‌తో గట్టి సందేశం..

హైదరాబాద్‌లో బాంబుపేలుళ్లు, ముంబ యి ట్రైన్ దాడులు, పార్లమెంట్‌పై దాడి ఇలా అనేక దాడులతో గత 46 ఏళ్లుగా పాక్ ఉగ్రవాదాన్ని భారత్‌పై ఎగదోస్తూ అనేకమంది ప్రాణాలను బలితీసుకుందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల సమయంలో నివాళులర్పించి సరిపెట్టుకునేవారమన్నారు.

కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక పఠాన్‌కోట్ సర్జికల్ స్ట్రుక్, పూల్వామా ఎయిర్ స్ట్రుక్, పహల్గాం ఘటన తర్వాత ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాన్ని కూడా మట్టిలో కలిపేస్తామనే గట్టి సందేశాన్ని ప్రధాని మోదీ ఇచ్చారన్నారు.

లాం టి సమయాల్లోనే పార్టీలు, కులాలు, మతా లు, వర్గాలు, వర్ణాలు అనేవి పక్కన పెట్టి దేశమంతా ఐక్యతగా నిలవాల్సిన అవసర ముందుని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌తో 9 ఉగ్రస్థావరాలను పాక్ భూభాగంలోకి చొరబడి మరీ ప్రతీకారం తీర్చుకున్నామన్నా రు. ఈ ఆపరేషన్‌లో ఏపీకి చెందిన ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాక రమన్నారు. ఇటువంటి సమయంలో నిర్వహిస్తున్న తిరంగా యాత్రలు, ర్యాలీల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొని దేశ ఐక్యతను చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

దేశవ్యతిరేకంగా రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు

గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్‌గాంధీ ప్రకటనలను గమనిస్తే, అవి దేశ సా యుధ దళాలను బలహీనపర్చేలా,  దేశీయ ఆవిష్కరణల ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించేలా ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఇతర దేశాల డ్రోన్‌లను ప్రశంసించడం నుంచి రాఫెల్ కొనుగోలును ఒక కుంభకోణం అని మాట్లాడటం వరకు ఆయన తీరు దేశ వ్యతిరేకంగా ఉందని కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. అగ్నివీర్‌ను విమర్శించ డం నుంచి ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రయత్నాలను దెబ్బతీయడం వరకు రాహుల్‌గాంధీ ఎప్పుడూ దేశం తరపున మాట్లాడలేదన్నారు. మరి ఆయన ఎవరి తరపున మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.