calender_icon.png 26 May, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి నిరోధక శాఖ అధికారులమంటూ టోకరా

26-05-2025 12:19:41 AM

  1. తహసీల్దార్ ను బెదిరించి రూ.98 వేలు కాజేసిన వైనం

టేకులపల్లి మండలంలో ఘటన 

రూ.2 లక్షల ఇవ్వాలంటూ డిమాండ్ 

లేకుంటే కేసులో ఇరికిస్తానంటూ బెదిరింపు 

టేకులపల్లి, మే 25 (విజయక్రాంతి): తాను అవినీతి నిరోధకశాఖ అధికారినని, లంచం కేసులో ఇరికిస్తానని బెదిరించడంతో టేకుల పల్లి తహసీల్దార్ గుర్తుతెలియని వ్యక్తికి రూ.98 వేల డబ్బు ముట్ట జెప్పాడు. టే కులపల్లి తహసీల్దార్ ముత్తయ్యకు శనివారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి పోన్కాల్ వచ్చింది. తాను అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ అతడు పలకరించాడు.

మీ కార్యాలయ ఆర్ ఐ కొ ద్ది సేపటి క్రితం లంచం తీసుకుంటూ మాకు పట్టుబడ్డాడని, ప్రస్తుతం మా అదుపులో ఉన్నాడు. రూ.2 లక్షలిస్తే నిన్ను కేసులో ఇరికించకుండా వది లేస్తా అని బెదిరించాడు. ఈనెలాఖరుతో ఈ తహసీల్దార్ ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సమయంలో కేసులు, ఇతర చిక్కులెందుకని ఆయన భయపడ్డారు. మంజుగౌరి అనే వివరాలతో ఉన్న 74832 47988 నంబరుకు నాలుగు దఫా లుగా రూ.98 వేలు పంపించారు.

కాసేపటికి తేరు కుని తన గిర్దావరు ఫోన్చేశారు. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్చేసి కాల్ కాన్ఫరెన్స్లో మీతో మాట్లాడించారు. ఏసిబీ దాడి గురించి నాకేం తెలీదు అని ఆయన సమాధానమిచ్చాడు. మోసగాడు చాకచ క్యంగా ఇద్దరినీ బురిడీ కొట్టించాడని తహసీల్దార్ గ్రహించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదిచ్చారు. పదవీ విరమణ సమయంలో ఇబ్బందులెందుకనే ఉద్దేశంతో మోసగాడు చెప్పి నట్టు డబ్బు పంపించానని ఫిర్యాదులో తెలిపారు. విచారణ కొనసాగుతుంది.