జోగిపేట ట్రాన్సిట్ హోమ్‌కు 13 మంది విదేశీ ఖైదీలు!
తొలిసారిగా హైదరాబాద్ నుంచి తరలింపు
సంగారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): వివిధ దేశాలకు చెందిన నిందితులను తొలిసారిగా సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఏర్పా టు చేసిన ట్రాన్సిట్ హోం ఫర్ ఫారినర్స్ జైలులో సోమవారం 13 మంది ఖైదీలను రిమాండ్‌కు తరలించారు. జిల్లాలోనే ఫారినర్స్ జైలును జోగిపేటలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధానిలో వివి ధ నేరారోపణల్లో దోషులుగా ఉన్న పలువు రు విదేశీ నేరగాళ్లను ఈ జైలుకు తరలించారు.
ఇందులో పది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. విదేశీయుల కోసం ట్రాన్సిట్ హోం లేదా హోల్డింగ్ సెం టర్ అనేది ప్రధానంగా వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటున్నవారు,అక్రమంగా ప్రవేశించినవారు, జైలు శిక్ష పూర్తయి తమ దేశానికి తిరిగి వెళ్ళడానికి వేచి చూస్తున్న విదేశీయులను ఉంచే తాత్కాలిక నివాస కేంద్రం. వీటిని గతంలో ’డిటెన్షన్ సెంటర్లు’ అని పిలిచేవారు. అయితే జోగిపేట ట్రాన్సిట్ హోంకు 13 మంది విదేశీయులను తరలించడం విశేషం.






