రామప్పను సందర్శించిన విదేశీయులు
03-11-2025 01:17 AM
వెంకటాపూర్(రామప్ప), నవంబర్2, (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం ఆస్ట్రియా దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ విశిష్టతను టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ వారికి వివరించారు. రామప్ప ఆలయ కట్టడం చాలా అద్భుతంగా ఉందని, శిల్పకళలు ఆకట్టుకునేలా ఉందని వారు కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సు, ప్రకృతి అందాలను తిలకించారు.






