03-11-2025 01:18:21 AM
జనగామ, నవంబర్2 (విజయక్రాంతి): ముంతా తుఫాన్ తాకిడికి గురై నష్టపోయిన రైతుల క్షేత్రాలను వ్యవసాయ శాఖ అధికారులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా పలు రైతు క్షేత్రాలను పర్యటించారు. ఈసారి పంట నష్టం వివరాల నమోదు కొరకు కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ద్వారా పంట నష్టం వివరాలు రైతు వారీగా సేకరిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో తుఫాను తాకిడికి రైతులు వరి, పత్తి పంట నష్టపోయినందున దానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో పర్యటించి నమోదు చేస్తున్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని జిల్లాలోని దేవరుప్పల మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన దారపు మధు, దారపు కుమార్ కి చెందిన 6 ఎకరాల పత్తి పంటను పరిశీలించారు. తర్వాత పాలకుర్తి మండలం లోని లక్ష్మీనారాయణ పురం గ్రామం,
గూడూరు గ్రామాలను మరియు జాఫర్గఢ్ మండలంలోని తిడుగు గ్రామంలో భారీ వర్షం , నీటి ప్రవాహం కారణంగా పూర్తిగా కొట్టుకుపోయిన పంటను ఎండబెట్టడానికి ఉంచిన రైతు కడారి సమ్మయ్యతోనూ, పంట నష్టం గురించి పత్రికల్లో ప్రచురించబడిన సాగరం గ్రామానికి చెందిన రైతు తీగల శ్రీనివాస్తోనూ సంభాషించాను.