2 September, 2026 | 2:45 AM

భూదోపిడీపై ఫోరెన్సిక్ ఆడిట్

21-12-2024 | 01:50am

భూభారతి చట్టం.. ప్రతిఒక్కరికీ చుట్టం

ఆర్వోఆర్- 2024 బిల్లు చట్టంగా మారితే, ధరణి ముసుగులో తాము చేసిన బాగోతాలు ఎక్కడ బయటపడతాయేమోనన్న భయంతో బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీలో అరాచకానికి పాల్పడ్డారు. వారి తప్పులు బయటపడితే తెలంగాణ ప్రజలు భవిష్యత్‌లో వారిని రాష్ట్రంలో ఉండనీయరన్న ఉద్దేశంతోనే భూభారతి చట్టాన్ని ఆమోదించకుండా అడ్డుకున్నారు.

సహచర సభ్యులు మాట్లాడుతుంటే బీఆర్‌ఎస్ సభ్యులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. సభలో ఏదిచేసినా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, చెల్లుబాటు అవుతుందన్న ఆలోచనతో వారు వ్యవహరిస్తున్నారు. ఐదు రోజులుగా బీఆర్‌ఎస్ సభ్యులు అబద్ధాలతో సభను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. భూభారతి బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. బిల్లుకు ఆమోదం లభించడంతో నా జన్మ ధన్యమైంది. 

  రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి