calender_icon.png 21 August, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

21-08-2025 12:18:05 AM

రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి 

కోదాడ, ఆగస్టు 20: సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో  లంచం తీసుకుంటూ ఫారెస్ట్ బీట్ అధికారి అనంతుల వెంకన్న నల్గొండ రేంజ్ యూనిట్ ఏసీబీ అధికారులకు పట్టు పడ్డారు.

రేంజ్ యూనిట్ ఏసీబీ ఆధికారి జగదీష్ చంద్ర తెలిపిన వివరాల మేరకు కలప వ్యాపారానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఓ ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేల లంచాన్ని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు నల్గొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  వారి సూచన మేరకు కోదాడ బైపాస్ రోడ్డులో రూ.20 వేలు లంచం ఇస్తుండగా వెంకన్నను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ నిబంధనల మేరకు వెంకన్నను హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.  ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్‌ని సంప్రదించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.