21-08-2025 12:19:19 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి ఆగస్టు 20 ( విజయ్ క్రాంతి ): వానాకాలం పంటకు సరిపడ యూరియా ఉందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రోజు ఆత్మకూర్ మండలంలోని ఫర్టిలైజర్ షాపులు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.కృత్రిమ కొరత సృష్టించాలని చేసిన, అధిక ధరలకు విక్రయించిన వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. షాప్ లైసెన్స్, ఎరువుల లైసెన్స్ లు ఉన్నాయా లేవా అని చెక్ చేయడం జరిగింది. షాప్ లో ఉన్న యూరియా, డిఏపి స్టాక్ ని పరిశీలించడం జరిగింది.
యూరియా పూర్తి గా అయిపోవడంతో వెంటనే సంబంధిత అధికారులకి ఫోన్ చేసి యూరియాను పంపించాలన్నారు. షాప్‌లో ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతుతో మాట్లాడారు. షాప్ యజమాని రేట్లు ఎక్కువ కి ఇస్తున్నడా, తక్కువ కి ఇస్తున్నారా అని ఆరా తీశారు.
షాపు వాళ్లు ఈ యూరియానే కొనుగోలు చేయాలని ఏమైనా ఒత్తిడి పెడుతున్నారా అని రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి లో కూడా మెరుగైన సేవలు ఉన్నాయని వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.