calender_icon.png 21 August, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీత కార్మికుడికి కానా ట్రస్ట్ ఆర్థిక సాయం

21-08-2025 12:16:37 AM

నల్గొండ రూరల్, ఆగస్టు 20: కనగల్ మండలంలోని జి ఎడవెల్లి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు మాదగోని సత్తయ్యకు బుధవారం ఆర్థిక సాయం అందజేశారు కుల వృత్తిలో భాగంగా జూలై లో తాటి చెట్టు ఎక్కి దిగుతున్న క్రమంలో కాలుజారి కిందపడి తలకు గాయం కావడంతో హాస్పిటల్ కి తరలించారు

ఈ విషయం కౌండిన్య అసోసి యేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ట్రస్ట్ సభ్యులు బల్గూరి వెంకన్న గౌడ్, నాతి గణేష్, బాల్నే రామచంద్రుడు ,తెలుసుకొని చికిత్స కోసం వారి కుటుంబానికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు కల్లుగీత కార్మిక సం ఘం తరపున..కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారికి గీతా కార్మికుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు గౌని బిక్షం, కొరివి లింగయ్య, వెంకన్న ,పర్సన బోయిన వెంకటేశం, కృష్ణయ్య, వెంకటేశం ,రాములు, గౌని నరేష్ పాల్గొన్నారు.