ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం
14-07-2026 01:21 AM
నాగిరెడ్డిపేట్, జులై 13 (విజయ క్రాంతి):మండలంలోని మాల్తుమ్మెద,రామక్కపల్లి గ్రామాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ ఊర చివర ఉన్నటువంటి కుంటల వద్ద 500 ఈత మొక్కలు నాటడం జరిగింది.అలాగే గ్రామస్తులకు ఇంటికో మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పుప్పాల సాయిలు,బెస్త సాయిలు, ఎల్లారెడ్డి ఎక్సైజ్ సిఐ.ఎండి. షాకీర్ హైమద్ ఎక్సైజ్ సిబ్బంది సురేష్,వెంకటేష్, నాగరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






