14 July, 2026 | 4:49 AM

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: టీడబ్ల్యూజేఎఫ్

14-07-2026 01:20 AM

వనపర్తి టౌన్, జూలై 13: జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వనపర్తి జిల్లా కమిటీ డిమాండ్ చేసారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసనలో జిల్లా అధ్యక్షుడు జూటూరు రాము మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అందించాలని, రైల్వే పాస్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్కు అందజేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు.