14-03-2025 12:00:00 AM
చెట్లను నరికితే వాల్టా చట్టం కింద కేసు నమోదు చేస్తామని జనానికి హెచ్చరికలు
అధికారులు దగ్గరుండి చెట్లను నరికి అమ్ముతుండ్రు
దొరికితేనే దొంగ లేకుంటే.. సర్దార్
జూలపల్లి అడవిలో చెట్లను నరికి అమ్మిన ఫారెస్ట్ అధికారులు
కట్టెలు తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన ఆమనగల్ ఫారెస్ట్ అధికారులు
మహబూబ్ నగర్ మార్చి 13 (విజయ క్రాంతి) : అడవి దొంగలు అధికారులే అనే విధంగా కొందరి ఫారెస్ట్ అధికారులు తీరు కనిపిస్తుంది. మొక్కలు పెంచండి వృక్షాలను చేయండి... జీవన మునగడకు అతి ముఖ్యమైన వాటిలో మొక్కలు ఎంతో ఉపయోగ పడతాయని చెబుతున్న వారిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఫారెస్ట్ అధికారులు కొందరు ఇవేమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మహమ్మదాబాద్ మండలం పరిధిలో జూలపల్లి అడవిలో వృక్షాలను నరికి భాజప్త అమ్మేశారు. ఎందుకు ప్రత్యేకంగా బేరం కుదుర్చు కున్నారు. పథకం ప్రకారం చెడును చేస్తున్నామని అందరిని నమ్మించి చదును చాటున పెద్ద వృక్షలను సైతం నరికి లారీలలో లోడ్ చేసి పంపించారు.
ఎందుకు ప్రత్యక్షంగా ఆ అడవి ప్రాంత శిక్షణ అధికారి ఈ వ్యవహారం అంతా నడిపించారని ఆరోపణలు ఉన్నా యి. మొక్కలను పెంచాలంటూ అధికారులు చెబుతూ మరోవైపు వృక్షాలను నరికి అమ్మేస్తే పట్టించుకునే నాతుడే కరువయ్యారు. ఈ నేపథ్యంలో మహమ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి అడవిలో చదును చేయాలని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చదును చేసినప్పటికీ ఆ ప్రాంతంలో పెద్ద మొక్కలను కూడా తొలగించి ఇతరులకు విక్రయానికి సంబదిత ఫారెస్టు అధికారులు సహకారం ఎంతో ఉందని తెలుస్తుంది. గత వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సంబంధిత అధికారులు విచారణ వేగవంతం చేస్తుండ్రు.
ఒప్పందం రెండు లక్షలంటా..?
అసలు జూలపల్లి అడవి ప్రాంతాన్ని చదును చేసి వచ్చే వర్షాకాలంలో నూతనంగా మొక్కలు నాటాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫారెస్ట్ ప్రాంతంలో 60 నుంచి 70 హెక్టర్ల అడవి ప్రాంతంలో పిచ్చి మొక్కలను తొలగించి చదును చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఈ ప్రాంతంలో అడవి ప్రాంతంలోని పెద్ద వృక్షాలను కూడా నరికి ఫారెస్ట్ కు సంబంధించిన అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో సంబంధిత ఫారెస్ట్ అడవి అధికారులు బేరం కూర్చున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 7 లారీల కట్టే వస్తుందని, అంచనా వేసి మొదటి లారీ లో కట్టెల లోడ్ చేసి నంచర్ల గేటు నుంచి కుల్కచర్ల మండల మీదుగా హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ఫారెస్ట్ అధికారులు కుల్కచర్ల మండల సమీపంలో కట్టెల లోడుతో వెళ్తున్న లారీని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్ నగర్ కు తరలించి ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించినట్లు తెలిసింది.
నరికిన చెట్ల మొదల్లో కాల్చివేత...
పెద్ద వృక్షలను ఎక్కడైతే అధికారులు నరికించేందుకు సహకరించడం జరిగిందో ఆ ప్రాంతంలో మొదళ్లను కాల్చివేయడం జరిగింది. ఉన్నత అధికారులు ఈ ప్రక్రియ అంత ఎలా జరిగిందని విచారణను వేగవంతం చేస్తున్నారు.ఈ వ్యవహారంలో బాధ్యులుగా సంబంధిత అధికారులని తేలితే వారిపై చర్యలు తీసుకునేందుకు సమయతమవుతున్నారు.
విచారణ జరుగుతుంది
జూలపల్లి అడవి ప్రాంతంలో వచ్చే వర్షాకాలంలో మొక్కలను నాటాలని చదును చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో చదును చేయడంతో పాటు పెద్ద వృక్షలను నరికి విక్రయించినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారణ చేస్తున్నాం. ఫారెస్ట్ అధికారులు ఇందుకు సహకరించినట్లు తేలితే వారిపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం.
సత్యనారాయణ, డీఎఫ్‌ఓ, మహబూబ్ నగర్