calender_icon.png 9 May, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్గాను కూల్చిన అటవీశాఖ అధికారులు

09-05-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, మే 8 (విజయక్రాంతి) ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణ పరిధిలోని సివిల్ లైన్ మూడో వార్డులో గల హజరత్ తాజుద్దీన్ బాబా దర్గాను అటవీశాఖ అధికారులు కూల్చివేశారు. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు ఈనెల 1వ తేదీన అటవీశాఖ సిబ్బంది దర్గా నిర్వాహకులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారని బాధితులు ఎస్కే సఫియా, జాఫర్లు తెలిపారు. 

స్థానికులు కొందరి ప్రోత్బలంతో అటవీ శాఖ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఇప్పటికే ఈ దర్గాపై పలుమార్లు అటవీశాఖ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్న, వాటిని చూపించిన అటవీశాఖ అధికారులు అతి ఉత్సాహంతో కూల్చివేశారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఈ విషయమై పూర్తిస్థాయి  విచారణ చేసి దోషులను శిక్షిస్తూ, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.