calender_icon.png 10 May, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.2.75 లక్షల విలువైన గంజాయి పట్టివేత

09-05-2025 12:00:00 AM

అశ్వరావుపేట మే 8 ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రూ.2. 75 లక్షల విలువచేసే ఐదు కిలో గంజాయిని అశ్వరావుపేట పోలీసులు పట్టుకొని 8 మందిని అరెస్ట్ చేశారు. వివరాలను అశ్వరావుపేట సిఐ పి.నాగరాజు వెల్లడించారు.

గురువారం ఉదయం ఎస్సు యాయతీ రాజు సిబ్బందితో అశ్వరావుపేటలోని భద్రాచలం రోడ్లో గల హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు.

ఏడుగురు మగ వ్యక్తులు,మూడు మోటారు సైకిళ్లపై ఊట్లపల్లి వైపు నుండి అశ్వారావుపేట వైపుకి వస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేస్తుండగా  పోలీసులకు భద్రాచలం రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద పట్టుకుని విచారించడమైనది. వీరి వద్ద నుండి 5.5 కేజీల గంజాయి, 6 సెల్ఫోన్లు, 3 మోటారు సైకిళ్ళు స్వాదీన పరచుకున్నామని తెలిపారు.